Krishna District: వినాయక నిమజ్జనంలో విషాదం.. కృష్ణా జిల్లాలో ముగ్గురి మృతి

  • మైలవరం నియోజకవర్గంలోని ఎ.కొండూరుతండాలో ఘటన
  • ప్రమాదవశాత్తు చెరువులో పడిన యువకులు
  • ఈత రాకపోవడంతో మృతి

వినాయక నిమజ్జనం చేస్తున్న వేళ నీట మునిగి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఎ.కొండూరుతండాలో చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి స్థానిక చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా,  గోపాలరావు, భూక్యా నాయక్, చంటి అనే ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు కలిసి వారి కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే వారు మృతి చెందారు. చెరువు లోతును అంచనా వేయడంలో పొరపాటు, ఈత రాకపోవడం వల్లే వారు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.  

Krishna District
dead
Andhra Pradesh
  • Loading...

More Telugu News