bigboss: అలీ రూడ్‌గా మాట్లాడుతున్నాడు.. నాకు కొంచెం రెస్పెక్ట్ కావాలి: నాగార్జునకు ఫిర్యాదు చేసిన శిల్పా చక్రవర్తి

  • అలీ చాలా దురుసగా ప్రవర్తించాడు
  • ఏడుస్తూ ఫిర్యాదు చేసిన శిల్ప
  • అలీని మందలించిన నాగార్జున

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోలోకి  వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ యాంకర్, నటి శిల్పా చక్రవర్తి.. హౌస్‌మేట్ అలీపై నాగార్జునకు ఫిర్యాదు చేసింది. శాండ్ టాస్క్‌లో భాగంగా అలీ తనతో దురుసుగా ప్రవర్తించాడని, అతడు మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని వ్యాఖ్యాత నాగార్జునకు ఫిర్యాదు చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.

‘కసి తగ్గింది కాబట్టే నువ్వు గెలిచావ్.. కసితో ఆడుంటే నువ్వు అవుట్’ అంటూ తనతో చాలా దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. హౌస్‌లో తనకు రెస్పెక్ట్ కావాలని, అది తనకు కొంచెం ఇస్తే చాలని ఏడుస్తూ ఫిర్యాదు చేసింది. శిల్ప ఫిర్యాదుతో అలీని నాగార్జున మందలించాడు. అయితే, ఈ విషయంలో అలీ తప్పు లేదని తర్వాత తేల్చారు.

bigboss
shilpa chakravarthy
star maa tv
  • Loading...

More Telugu News