West Godavari District: గ్రామస్థురాలు తిట్టిందని వలంటీర్ ఆత్మహత్య

  • పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి  మండలంలో ఘటన
  • ఆధార్‌లో మార్పులు తన పరిధిలోకి రాదని చెప్పినా వినిపించుకోని గ్రామస్థురాలు
  • మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న వలంటీర్

గ్రామస్థురాలు తిట్టిందని వలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో జరిగింది. తన ఆధార్‌కార్డులో ఇంటి పేరు మార్చాలంటూ గ్రామానికి చెందిన మంగ.. వలంటీర్ నవీన(23)ను కోరింది. అయితే, ఆధార్ కార్డులో సవరణలు తన పరిధిలోకి రావని చెప్పినా ఆమె వినిపించుకోకుండా వాగ్వివాదానికి దిగింది. ఆపై పరుష పదజాలాన్ని ఉపయోగించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన శనివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో సూసైడ్ నోట్ దొరికినట్టు నవీన తండ్రి శ్రీరామ్మూర్తి తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



West Godavari District
volunteer
suicide
  • Loading...

More Telugu News