Nara Lokesh: ఎంతైనా అత్యంత గౌరవనీయమైన ఇంటి పేరు కదా... ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయంపై లోకేశ్ విమర్శలు
- 100 ముఖ్యమైన పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారంటూ ఆరోపణలు
- 5 అక్కరకురాని పదవులు బీసీలకు ఇచ్చారని విమర్శించిన టీడీపీ యువనేత
- గొప్ప సామాజిక న్యాయం పాటించారంటూ వ్యంగ్యం
సీఎం జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. 100 ముఖ్యమైన పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని, మంత్రి బుగ్గన గారు అన్నట్టు ఎంతైనా అత్యంత గౌరవనీయమైన ఇంటి పేరు కదా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అదే సమయంలో బీసీలకు 5 అక్కరకురాని పదవులు ఇచ్చి ఎంతో గొప్ప సామాజిక న్యాయం ప్రదర్శించారని విమర్శించారు. "దేశంలో ఎక్కడా లేని విధంగా తన పాలనలో సామాజిక న్యాయం పాటిస్తామని కోతలు కోశారు. కానీ, 100 శాతం పల్లీలు ఒకే సామాజిక వర్గానికి పంచి, ఓ 50 శాతం పొట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విదిలించారు... సామాజిక అన్యాయం" అంటూ ట్వీట్ చేశారు.