PV Sindhu: పీవీ సింధు, సాయిప్రణీత్ లకు చిన్న సన్మానం కూడా చేయలేదు: సీఎం పై మండిపడిన సుజనా చౌదరి

  • ఏపీ సర్కారు 100 రోజుల పాలనపై సుజనా విమర్శలు
  • జగన్ ఏం చెప్పారు, ఏంచేస్తున్నారు అంటూ మండిపాటు
  • సన్నబియ్యంపైనా మాట మార్చారంటూ వ్యాఖ్యలు

సీఎంగా జగన్ 100 రోజుల పాలనపై బీజేపీ నేత సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ చెప్పిందేమిటి, ఆయన చేస్తున్నదేమిటి అంటూ నిలదీశారు. అంతర్జాతీయ వేదికలపై ఘనవిజయాలు సాధించిన పీవీ సింధు, సాయిప్రణీత్ లకు చిన్నపాటి సన్మానం కూడా చేయలేదని మండిపడ్డారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పారని, జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిస్తే రూ. 5 లక్షలు ఇస్తామని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రీడారంగం పట్ల ఏపీ సర్కారు తీరు ఇదేనా? అంటూ నిలదీశారు.

అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని చెప్పి, ప్రజావేదిక, రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలు తప్ప మరింకేమైనా కూలగొట్టారా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం మడమతిప్పని పోరాటం అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. చివరికి సన్నబియ్యంపై మాట మార్చిన ఘనత కూడా జగన్ సర్కారుకే దక్కుతుందని సుజనా విమర్శించారు.

PV Sindhu
Sujana Chowdary
Andhra Pradesh
Jagan
YSRCP
  • Loading...

More Telugu News