Jagan: వైఎస్ జగన్ 100 రోజుల అద్భుత పాలన చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

  • జగన్ 100 రోజుల పాలన నేపథ్యంలో పుష్ప శ్రీవాణి వ్యాఖ్యలు
  • 100 ఏళ్లయినా జరుగుతాయో లేదో అనుకున్న పనులను జగన్ చేసి చూపించారంటూ ప్రశంసలు
  • పునరావాస శిబిరాల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపణలు

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. ఏపీలో సీఎం జగన్ 100 రోజుల అద్భుత పాలన చూసి చంద్రబాబుకు మతిభ్రమించిందని వ్యాఖ్యానించారు. మరో 100 ఏళ్లయినా జరుగుతాయో లేదో అనుకున్న పనులను కూడా జగన్ వంద రోజుల్లోనే చేసి చూపించారని కితాబిచ్చారు. అఘాయిత్యాలకు పాల్పడిన తమ పార్టీ నేతలను కాపాడుకునేందుకే చంద్రబాబు పునరావాస శిబిరాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసినప్పుడు, నారాయణ కాలేజీల్లో 25 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయినప్పుడు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తే బాగుండేదని వ్యంగ్యం ప్రదర్శించారు.

Jagan
Chandrababu
Pushpa Srivani
Andhra Pradesh
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News