Andhra Pradesh: కుమార్తె బ్రాహ్మణి, అల్లుడు నారా లోకేశ్ తో కలిసి నందమూరి బాలయ్య ఫారిన్ టూర్!

  • హైదరాబాద్ నుంచి విదేశాలకు పయనం
  • ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య
  • 105వ సినిమాపై భారీగా అంచనాలు

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బాలయ్య న్యూలుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ లో కొన్ని రోజుల విరామం లభించడంతో నందమూరి బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణి, అల్లుడు నారా లోకేశ్ తో కలిసి ఫారిన్ టూర్ కు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వీరు బయలుదేరినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంచితే, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో బాలయ్య అభిమానులు కేఎస్ రవికుమార్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు బాలయ్య 105వ సినిమా కావడంతో దీన్ని దర్శకుడు రవికుమార్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Andhra Pradesh
Telangana
Telugudesam
Balakrishna
Nara Lokesh
brahmini
foreign tour
  • Error fetching data: Network response was not ok

More Telugu News