Andhra Pradesh: ఏపీలో పేదలు, విద్యార్థులను ఆ దేవుడే కాపాడాలి.. సన్నబియ్యంపై వర్ల రామయ్య సెటైర్లు!

  • సన్నబియ్యం పథకం ప్రారంభించిన సీఎం
  • చెడిపోయిన బియ్యం వస్తోందన్న టీడీపీ నేత
  • ప్రభుత్వ మాటలకు, చేతలకు తేడా ఉందని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేషన్ షాపుల్లో సన్నబియ్యం సరఫరా పథకాన్ని నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే చెడిపోయిన బియ్యాన్ని ఈ పథకంలో భాగంగా సరఫరా చేస్తున్నట్లు టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి గారు! సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం పేద వాళ్ళకిస్తామని చెప్పిన బియ్యం ఇవేనా? అన్నం ఎలా వుందో క్రింది బొమ్మలో చూడండి. మీ మాటలకు చేతలకు చాలా తేడా సుమా? సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు కూడా ఇవే బియ్యం ఇదే అన్నం. ఆ దేవుడే వాళ్ళను కాపాడాలి సుమా’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Telugudesam
varla ramaiah
YSRCP
Jagan
Srikakulam District
Sanna biyyam
Ration shops
  • Error fetching data: Network response was not ok

More Telugu News