Yadadri: యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ బొమ్మను చెక్కినవారు... వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా?: రాజాసింగ్

  • కేసీఆర్, కారు బొమ్మలను తొలగించేందుకు వారం సమయం ఇస్తున్నాం
  • తొలగించకపోతే హిందూవాదులతో కలసి ఆందోళన చేపడతాం
  • యాదాద్రిని సొంత సొమ్ముతో కడుతున్నారా?

యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయ స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారును చెక్కడం ప్రకంపనలను పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నేడు యాదాద్రి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నామని చెప్పారు.

ఈలోగా బొమ్మలను తొలగించకపోతే హిందూవాదులతో కలసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. యాదాద్రిని సొంత సొమ్ముతో కడుతున్నారా? లేక ప్రజల సొమ్ముతో కడుతున్నారా? అని ప్రశ్నించారు. భావితరాలకు తెలియజేసేలా నాయకుల బొమ్మలను చెక్కినవారు... వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా? అని అడిగారు.

Yadadri
KCR
Raja Singh
TRS
BJP
  • Loading...

More Telugu News