Maharashtra: ముంబైలో కొత్తగా మూడు మెట్రో రైలు మార్గాలు.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

  • బెంగళూరు నుంచి ఈ ఉదయం ఆర్థిక రాజధానికి
  • లోకమాన్య సేవా సంఘ్ తిలక్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు
  • అంతకు ముందు మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

ముంబైలో కొత్తగా మూడు మెట్రో రైలు మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పనులకు ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు.

 చంద్రయాన్‌-2కు సంబంధించి విక్రమ్‌ ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి నిన్న వెళ్లిన ప్రధాని అక్కడి నుంచి నేరుగా ముంబై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విల్లే పార్లేలోని లోకమాన్య సేవా సంఘ్ తిలక్‌ మందిర్‌కు చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెట్రో  రైలు పనులకు శంకుస్థాపన చేశారు.

Maharashtra
mumbai
three metro lines
Narendra Modi
foundation stone
  • Loading...

More Telugu News