Andhra Pradesh: వెంటనే ఐఏఎస్ అధికారుల్ని రంగంలోకి దించండి!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్

  • కేంద్రం, రాష్ట్రం వైఫల్యం వల్లే యూరియా కొరత
  • ఐఏఎస్ లను స్పెషల్ ఇన్ చార్జీలుగా నియమించండి
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, యూరియా వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఇతర వ్యవసాయ శాఖ ఆఫీసుల ముందు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చాలా దుర్భరమైన స్థితిలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లోపం కారణంగానే తెలంగాణలో యూరియా కొరత తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రతీ జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఇన్ చార్జీగా నియమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
KCR
TRS
Congress
IAS OFFICERS
Revanth Reddy
URIA SHORTAGE
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News