Telugudesam: వంద రోజుల పాలన వైఫల్యాల పుట్ట: జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ పుస్తకం

  • ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభం
  • టీడీపీ కార్యకర్తలపై దాడుల వరకు ప్రస్తావన
  • త్వరలో అమరావతిలో పుస్తకావిష్కరణ

వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం వంద రోజుల్లోనే అన్ని రంగాల్లో విఫలం చెందిందంటూ తెలుగుదేశం పార్టీ పుస్తకం ప్రచురిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంపై వామపక్షాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తాజాగా టీడీపీ అమల్లోకి తెస్తోంది. అమరావతిలో అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేసిన ప్రజావేదిక సంఘటన నుంచి రాజధాని పనుల నిలిపివేత, రివర్స్‌ టెండరింగ్‌, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల వరకు పలు అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఈ పుస్తకాన్ని త్వరలో అమరావతిలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

Telugudesam
YSRCP
jagan govt
book
  • Loading...

More Telugu News