Andhra Pradesh: ఇస్రో శాస్త్రవేత్తల పట్ల దేశం గర్వపడుతోంది.. మీరు అసాధారణమైన కృషి చేశారు!: ఏపీ సీఎం జగన్
- మనం చంద్రుడిని దాదాపుగా అందుకున్నాం
- ఈ చిరు అడ్డంకి మన విజయానికి పునాది కావాలి
- చంద్రయాన్-2 అవాంతరాలపై ఏపీ సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరిదశలో అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా భూమి నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు.
కాగా, ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ‘మనం చంద్రుడిని దాదాపుగా అందుకున్నాం. భారత్ తన శాస్త్రవేత్తల పట్ల గర్వపడుతోంది. ఇలాంటి చిరు అడ్డంకి మన విజయానికి పునాది కావాలి. భారత్ మొత్తం ఇస్రో టీమ్ కు అండగా నిలుస్తోంది. వాళ్లు చేసిన అసాధారణ, అద్భుతమైన కృషిని ప్రశంసిస్తోంది’ అని జగన్ ట్వీట్ చేశారు.