Lord Ganesha: 12న హైదరాబాదు గణేశ్ శోభాయాత్ర.. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

  • బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్ర ప్రారంభం
  • యాత్రలో పాల్గొననున్న స్వామి ప్రజ్ఞానంద
  • యాత్రలో 40 లక్షల మంది పాల్గొనే అవకాశం

హైదరాబాద్ నగరంలో గణేశ్ శోభాయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 8 గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్టు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొంది. స్వామి ప్రజ్ఞానంద శోభాయాత్రలో పాల్గొంటారని తెలిపింది. బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత ప్రారంభమయ్యే శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్‌ మీదుగా సాగుతుందని వివరించారు.

శోభాయాత్రలో డీజేలు, సినిమా పాటలు, అసభ్య డాన్సులు చేయవద్దని, దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలని ఉత్సవ సమితి సూచించింది. ప్రతీ ఏడాది ఓ థీమ్ పెట్టుకుంటున్నట్టుగానే ఈసారి  జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. శోభాయాత్రను తిలకించేందుకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Lord Ganesha
Hyderabad
shobha yatra
  • Loading...

More Telugu News