Narendra Modi: చంద్రయాన్ 2 ప్రయోగం.. మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

  • చివరి క్షణంలో ఇస్రో కేంద్రంతో ల్యాండర్‌కు తెగిన సంబంధాలు
  • శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపిన మోదీ
  • 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగం

చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశలో సాంకేతిక సమస్యలు తలెత్తి విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో దేశ ప్రజలు, శాస్త్రవేత్తలు నిరాశలో కూరుకుపోయారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాలను వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకున్న మోదీ శాస్త్రవేత్తల్లో భరోసా నింపారు. అధైర్యం వద్దని, భవిష్యత్తులో మరిన్ని విజయాలకు ఇది నాంది అవుతుందని వారిలోని నిరాశను పారదోలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం 8 గంటలకు చంద్రయాన్2 ప్రయోగంపై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ఆయన మాట్లాడనున్నట్టు అధికారులు తెలిపారు.

Narendra Modi
isro
chandrayaan2
  • Loading...

More Telugu News