Pawan Kalyan: తెలంగాణలో రైతు మృతిపై పవన్ కల్యాణ్ ఆవేదన

  • యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి
  • చాలా దురదృష్టకరమైన ఘటన అన్న పవన్
  • ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

యూరియా కోసం తెలంగాణలో ఓ అన్నదాత చనిపోవడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. ఈ ఘటనపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఎల్లయ్య ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Farmer
Janasena
  • Loading...

More Telugu News