Hollywood: సంగీత ప్రపంచం నుంచి తప్పుకుంటున్నా.. అమెరికన్ ర్యాపర్ నిక్కి మినాజ్ సంచలన ప్రకటన!

  • కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం
  • బాయ్ ఫ్రెండ్ పెటీని పెళ్లిచేసుకోనున్న నిక్కీ
  • 2009లో పింక్ ఫ్రైడే ఆల్బమ్ తో తెరంగేట్రం

ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. సంగీత ప్రపంచం నుంచి తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ తెలిపింది. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే 2 కోట్ల మంది ఫాలోవర్లు ఒక్కసారిగా విస్తుపోయారు.

 ‘సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్నా. ఇకపై కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. మీరంతా(అభిమానులు) ఇప్పుడు సంతోషంగా ఉన్నారని తెలుసు. నా అభిమానులంతా నేను చనిపోయేవరకూ అభిమానిస్తూనే ఉంటారని కోరుకుంటున్నా’ అని చెప్పింది.

 నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్  జూ పెటీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తన ట్విట్టర్ ఖాతాలో సైతం పేరును మిసెస్ పెటీగా మార్చుకుంది. ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో 2009లో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది.

Hollywood
USA
nikki menaj
Nicki minaj
Retirement
Music industry
Twitter
announced
  • Loading...

More Telugu News