Smart Agro Food park: స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటా పోటీ నినాదాలు!

  • మెగా ఫుడ్ పార్క్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు
  • పాల్గొన్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలు
  • జీవన్ రెడ్డి, అరవింద్ వర్గీయుల పోటాపోటీ నినాదాలు

నిజామాబాద్ జిల్లాలో స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ పార్క్ ను కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సహాయ మంత్రి రామేశ్వర్ తెలి ప్రారంభించారు. నందిపేట్ మండలంలోని లక్కంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ ఎంఆర్ఎం రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్ వర్గీయులు పోటా పోటీ నినాదాలు చేశారు. అరవింద్ ప్రసంగిస్తున్న సమయంలో ‘కేసీఆర్..కేసీఆర్’ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు; జీవన్ రెడ్డి ప్రసంగిస్తుండగా ‘మోదీ..మోదీ’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Smart Agro Food park
TRS
Bjp
Nizamabad
  • Loading...

More Telugu News