Bollywood: హీరోయిన్ స్వరభాస్కర్ ను పందితో పోల్చిన బీజేపీ అభిమాని.. దీటుగా స్పందించిన నటి!

  • బీజేపీ విధానాలను తప్పుపట్టిన స్వరభాస్కర్
  • సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్న మద్దతుదారులు
  • బీజేపీ అభిమానిపై మండిపడ్డ నెటిజన్లు

బాలీవుడ్ నటి స్వరభాస్కర్ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. గోరక్షకుల ఆగడాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ ఉంటుంది. దీంతో బీజేపీ మద్దతుదారులు సైతం స్వరభాస్కర్ ను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. తాజాగా అమిత్ అనే బీజేపీ మద్దతుదారుడు ట్విట్టర్ లో స్వరభాస్కర్ పై అసభ్యకరమైన పోస్ట్ పెట్టాడు.

ఓ కార్యక్రమంలో స్వరభాస్కర్ దిగిన ఫొటోను, పంది ఫొటోను పక్కపక్కనే పెట్టి ‘ఎవరు అందంగా కనిపిస్తున్నారో చెప్పండి?’ అని తన ఫాలోవర్లను కోరాడు. ఈ సందర్భంగా స్వరభాస్కర్ నటించిన సెక్షన్ 377 కార్యక్రమాన్ని చూడొద్దనీ, దీన్ని ప్రసారం చేస్తున్న నెట్ ఫ్లిక్స్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అంతేకాకుండా పంది నచ్చితే లైక్ కొట్టాలనీ, స్వరభాస్కర్ కోసం రీట్వీట్ చేయాలని వెటకారమాడాడు.

దీంతో ఈ ట్వీట్ పై స్వరభాస్కర్ దీటుగా స్పందించింది. ‘వూవూవూ... పంది పిల్ల చాలా అందంగా ఉంది. మురికిగా ఉన్నా అందంగానే ఉంది. నీ ట్వీట్ తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈసారి మరింత గట్టిగా ట్రై చేయ్’ అని చురకలు అంటించింది. ఈ సందర్భంగా చాలామంది నెటిజన్లు సైతం అమిత్ అనే నెటిజన్ పై తీవ్రంగా మండిపడ్డారు. తాము స్వరభాస్కర్ ను ఇష్టపడకపోయినా ఇలాంటి దుష్ప్రచారాన్ని మాత్రం సమర్థించబోమని స్పష్టం చేశారు. స్వరభాస్కర్ కూడా ఓ ఇంటి ఆడపిల్లేననీ, హుందాగా ప్రవర్తించాలని తలంటారు.

Bollywood
SWARA BHASKAR
TROLL
PIG
Twitter
COUNTER
  • Error fetching data: Network response was not ok

More Telugu News