Andhra Pradesh: ‘కోడి కత్తి శ్రీనివాస్’పై జైలులో హత్యాయత్నం.. సంచలన ఆరోపణలు చేసిన లాయర్ సలీం!

  • గతేడాది అక్టోబర్ 25న జగన్ పై హత్యాయత్నం
  • జైలులో శ్రీనివాస్ ను కొట్టిన జైలర్, వార్డెన్
  • వేరే జైలుకు మార్చాలని లాయర్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై గతేడాది అక్టోబర్ 25న హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హైదరాబాదు రావడం కోసం ఆ రోజున విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఉండగా, శ్రీనివాస్ అనే యువకుడు సెల్ఫీ తీసుకునే వంకతో ఆయనపై కోడికత్తితో దాడిచేశాడు. శ్రీనివాస్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతని న్యాయవాది సలీం సంచలన ఆరోపణలు చేశారు. జైలులో శ్రీనివాస్ పై హత్యాయత్నం జరిగిందని లాయర్ సలీం ఆరోపించారు.

జైలు వార్డెన్, జైలర్ తనపై దాడిచేసినట్లు శ్రీనివాస్ చెప్పాడన్నారు. రాజమండ్రి జైలులో శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి జైలు జైలర్, వార్డెన్ లపై కేసు నమోదుచేయాలని ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని సలీం వెల్లడించారు. శ్రీనివాస్ ను మరో జైలుకు తరలించాల్సిందిగా పిటిషన్ లో కోరినట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Murder attempt
Rajamundry central jail
Police
attack
Chief Minister
  • Loading...

More Telugu News