Nampalli Court: జగన్ మినహా... అక్రమాస్తుల కేసులో కోర్టుకు విజయసాయి, శ్రీలక్ష్మి, గాలి!

  • నేడు సీబీఐ కోర్టులో విచారణ
  • హాజరైన నిందితులు
  • జగన్ తరఫున పిటిషన్ దాఖలు

తనపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్, నేడు సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, మాజీ ఎంపీ గాలి జనార్దన్ రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫున ఆయన న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించనున్న సంగతి తెలిసిందే. నిందితుల హాజరును తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణను వాయిదా వేసింది.

Nampalli Court
CBI
Jagan
Vijay Sai Reddy
Sri Lakshmi
Gali Janardhan Reddy
  • Loading...

More Telugu News