Andhra Pradesh: పంట పొలానికి నీళ్లు పెడుతూ.. కరెంట్ షాక్ తో అన్నదమ్ముల దుర్మరణం!

  • అనంతపురం జిల్లాలో ఘటన
  • హంద్రినీవా కాలువ నుంచి నీటి సరఫరా
  • మోటార్ పైప్ లోకి విద్యుత్ ప్రసారం

పంట పొలానికి నీరు పెట్టేందుకు చేసిన ప్రయత్నం ఇద్దరు రైతుల పాలిట మృత్యువుగా మారింది. విద్యుత్ షాక్ రూపంలో వారిని మృత్యువు కాటేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మండలం పొట్టిపాడులో హంద్రినీవా కాలువ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పొలానికి నీళ్లు తరలించేందుకు అన్నదమ్ములైన ఇద్దరు రైతులు మోటార్ అమర్చారు.

ఈ సందర్భంగా నీటి పైపునకు విద్యుత్ ప్రసారం జరగడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కలవారు వీరిని గమనించి విద్యుత్ ప్రసారాన్ని ఆపేశారు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. ఒకేరోజు గ్రామానికి చెందిన అన్నదమ్ములు చనిపోవడంతో పొట్టిపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

Andhra Pradesh
Anantapur District
Current shock
Electricity shock
Brothers died
Police
  • Loading...

More Telugu News