Uttar Pradesh: బిల్లు ఎక్కువగా వేశారని కస్టమర్ గొడవ.. కొట్టి చంపేసిన హోటల్ యజమాని!

  • ఉత్తరప్రదేశ్ లోని బదోమీలో ఘటన
  • రూ.180 బిల్లు వేసిన హోటల్ ఓనర్
  • వాగ్వాదానికి దిగిన ఇద్దరు యువకులు

హోటల్ బిల్లు చెల్లించలేదనే కారణంతో ఓ యజమాని రాక్షసుడిగా మారిపోయాడు. తన సిబ్బందితో కలిసి కస్టమర్లపై రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దుర్ఘటనలో ఓ కస్టమర్ చనిపోవడంతో సదరు హోటల్ సిబ్బంది పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదోమీ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బదోమీ పట్టణంలో సూరజ్, విశాల్ అనే ఇద్దరు యువకులు ఓ దాబా హోటల్ కు వచ్చారు. భోజనం తిన్నాక యజమాని రూ.180 బిల్ వేశాడు. అయితే తాము తిన్నదానికి ఇది చాలా ఎక్కువని ఇద్దరు యువకులు వాదనకు దిగారు. ఈ వాగ్వాదం ముదరడంతో సహనం కోల్పోయిన యజమాని గుర్మయిల్, అతని కుమారుడు సరేంద్ర తమ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి దిగారు. రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.

ఈ దాడి నుంచి విశాల్ తప్పించుకోగా, సూరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుర్మయిల్ తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేశారు. గుర్మయిల్, సురేంద్రలను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Uttar Pradesh
Hotel
Daba
Rs180 bill
Fight
Murder
Police
  • Loading...

More Telugu News