Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను వంగవీటి రాధాకృష్ణ కలవడంతో జోరుగా ఊహాగానాలు!

  • దిండి రిసార్ట్స్ లో పవన్ తో వంగవీటి రాధా భేటీ
  • జనసేనలో చేరుతున్నట్టు రాధాపై ప్రచారం
  • జనసేన మేధోమథనంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

తూర్పు గోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ లో జనసేన మేధోమథనం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన మేధోమథనం కంటే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవడమే మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే టీడీపీలో చేరిన వంగవీటి రాధా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ఇవాళ పవన్ కల్యాణ్ ను కలవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. గత కొంతకాలంగా వంగవీటి రాధా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇక పవన్ తో భేటీ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల గురించి ఇరువురు చర్చించినట్టు సమాచారం.

Pawan Kalyan
Vangaveeti
  • Loading...

More Telugu News