Pawan Kalyan: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ని కలవనున్న వంగవీటి రాధా!

  • దిండి రిసార్ట్స్ లో ‘జనసేన’ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
  • రిసార్ట్స్ కు వెళ్లిన వంగవీటి రాధా
  • నాదెండ్లతో చర్చలు జరిపిన వైనం

జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కొద్ది సేపటి క్రితం కలిశారు. తూర్పు గోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ లో జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. అక్కడికి వెళ్లిన వంగవీటి రాధా, మనోహర్ ను కలిసి చర్చలు జరిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని రాధా కలవనున్నారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం మలికిపురం వెళ్తున్న పవన్ కి పి.గన్నవరం మండలంలోని  జి.పెదపూడి వద్ద ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Pawan Kalyan
Vangaveeti
Nadendla
Janasena
  • Loading...

More Telugu News