Telangana: ఈటల రాజేందర్ కు, నాకు నిజాలు మాట్లాడటమే వచ్చు: రసమయి బాలకిషన్

  • మేమిద్దరం కడుపులో ఏమీ దాచుకోం
  • తెలంగాణ ఉద్యమంలో మేమిద్దరం ఉన్నాం
  • మా నోటి వెంట అబద్ధాలు రావు

మంత్రి పదవి ఎవరి భిక్ష కాదంటూ తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఈటలకు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చని, తామిద్దరం కడుపులో ఏమీ దాచుకోమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తామిద్దరం ఉన్నామని, సొంత రాష్ట్రం కోసం కొట్టాడినోళ్లమని, తమ నోటి వెంట అబద్ధాలు రావని అన్నారు.

Telangana
Minister
Eetala Rajender
Rasamai
  • Loading...

More Telugu News