Jagan: న్యూడెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ

  • అమరావతిలో సమావేశం
  • జగన్ తో భేటీ అయిన న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ఉపాధ్యక్షుడు
  • రాష్ట్రానికి రూ.6,000 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సుముఖత!

త్వరలోనే రాష్ట్రానికి రూ.6,000 కోట్ల రుణం మంజూరు చేసే అంశంపై న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ తో  అమరావతిలో సమావేశమయ్యారు. ఏపీలో రోడ్లను మెరుగుపర్చడంతో పాటు, పలు ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.ఈ రుణాన్ని 32 సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు ప్రతినిధులు చెప్పారు. జగన్ తో భేటీ అయిన వారిలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ఉపాధ్యక్షుడు జాంగ్, ప్రాజెక్ట్ హెడ్ రాజ్ పుర్కార్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అదనంగా మరికొన్ని నిధులు కూడా రుణంగా ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్ల నిర్మాణం, ఆధునికీకరణ కోసం రూ.25,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

Jagan
NDB
Andhra Pradesh
  • Loading...

More Telugu News