Anna Canteen: రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి... పేదోడి కడుపుకొట్టడం అన్యాయం: ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవేదన

  • అన్న క్యాంటీన్ల మూసివేతపై స్పందించిన టీడీపీ యువ ఎంపీ
  • చంద్రబాబు తీసుకువచ్చిన పథకాలను ఆపేస్తున్నారంటూ సర్కారుపై అసంతృప్తి
  • పేదవాడి ఆకలి గుర్తించని ప్రభుత్వం ఎందుకంటూ ఘాటు విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు విశేష ప్రజాదరణ లభించడం తెలిసిందే. అయితే, జగన్ సర్కారు వచ్చాక అన్న క్యాంటీన్లను మూసివేస్తున్నారంటూ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు మూతపడ్డాయని, చంద్రబాబునాయుడు ప్రారంభించిన ప్రభుత్వ పథకాలను ఆపేసి పేదవాళ్ల కడుపుకొట్టడం అన్యాయం అని ట్వీట్ చేశారు. ఆకలికి రాజకీయం తెలియదని నారా లోకేశ్ గారు అన్న మాట నిజమేనని పేర్కొన్నారు. పేదవాడి బాధను గుర్తించలేని నాయకులు, ప్రభుత్వం ఎందుకు? అంటూ మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అంటూ ఆరోపించారు.

Anna Canteen
Telugudesam
Chandrababu
Ram Mohan Naidu
YSRCP
Jagan
  • Loading...

More Telugu News