Surya: 'కాప్పాన్' ట్రైలర్ తో అదరగొట్టేస్తోన్న సూర్య

  • సూర్య తాజా చిత్రంగా 'కాప్పాన్' 
  • తెలుగు వెర్షన్ టైటిల్ గా 'బందోబస్త్'
  • ఈ నెల 20న రెండు భాషల్లో విడుదల

సూర్య కథానాయకుడిగా 'కాప్పాన్' నిర్మితమైంది. కేవీ ఆనంద్ రూపొందించిన ఈ సినిమాలో రైతు పాత్రలోను .. కమాండో పాత్రలోను సూర్య డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన సాయేషా సైగల్ అలరించనుంది. ఇక కీలకమైన పాత్రలో మోహన్ లాల్ .. ముఖ్యమైన పాత్రలో ఆర్య నటించారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ వదిలారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ .. మసాలా అంశాలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగులో ఈ సినిమాకి 'బందోబస్త్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న సూర్యకి, ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News