chidambaram: చిదంబరానికి సుప్రీంలో లభించని ఊరట...ఈడీ కేసులో ముందస్తు బెయిల్ కు నో

  • పిటిషన్‌ తిరస్కరించిన అత్యున్నత న్యాయ స్థానం
  • ఈడీ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు
  • ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ అరెస్టులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత పి.చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించ లేదు. తనకు ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించింది. ఈడీ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయ స్థానం ముందుస్తు బెయిల్‌ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఇప్పటికే సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయినా ప్రయోజనం దక్కలేదు.

chidambaram
ED arrest
baili pitition
apex court
  • Loading...

More Telugu News