Balaraju: వైసీపీలో చేరనున్న జనసేన నేత పసుపులేటి బాలరాజు?

  • ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్న బాలరాజు
  • అనుచరులతో మంతనాలు జరిపిన మాజీ మంత్రి
  • జగన్ మంచి పథకాలు తీసుకొచ్చారంటూ ప్రశంస

జనసేన నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. అనారోగ్యంతో బాధపడ్డ ఆయన మూడు నెలల తర్వాత చింతపల్లికి వచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో అనుచరులతో ఆయన మంతనాలు జరిపారు. మరోవైపు, బాలరాజు పార్టీ మార్పుపై ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది. బాలరాజుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్ తీసుకొచ్చారని ప్రశంసించారు. మద్యపాన నిషేధం మంచి నిర్ణయమని చెప్పారు.

Balaraju
YSRCP
Janasena
  • Loading...

More Telugu News