Vijayawada: జగన్‌ ప్రభుత్వంలో రద్దు పద్దులే అధికం: బోండా ఉమ ఎద్దేవా

  • ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై ఆగ్రహం
  • రిజిస్ట్రేషన్‌ డిమాండ్‌తో టీడీపీ ఆందోళన
  • విజయవాడలో రిలే దీక్ష చేపట్టిన రమణారావు

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం రద్దు పద్దుల్లో ఘనత వహించిందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులనే కాదని, చివరికి పేదలకు ఇచ్చే ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ రద్దుల పద్దును అమలు చేస్తూ తన తీరును చాటుకుంటోందని విమర్శించారు.

గజం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 74ను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో, దీన్ని నిరసిస్తూ అర్బన్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రమణారావు ఈరోజు విజయవాడలో ప్రారంభించిన రిలే దీక్షను ఉమ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లకు బ్యాంకు రుణాలు కూడా మంజూరైన తరుణంలో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడం దారుణమన్నారు. పేద ప్రజలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశారని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు.

Vijayawada
Bonda Uma
YSRCP
govt.
  • Loading...

More Telugu News