Karnataka: రాజకీయ కక్ష... చట్టం కన్నా ఎంతో భయానకం: పోలీసు స్టేషన్ నుంచి డీకే శివకుమార్ సంచలన వీడియో!

  • మంగళవారం అరెస్ట్ అయిన శివకుమార్
  • 14 రోజుల కస్టడీ విధించిన న్యాయస్థానం
  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్

  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసిన వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసులో శివకుమార్ ను న్యాయస్థానం 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసిన శివకుమార్ "రాజకీయ కక్షసాధింపు దేశంలోని చట్టాలకన్నా ఎంతో బలమైనది" అని వ్యాఖ్యానించడం వినిపిస్తోంది. ఇదే వీడియోలో శివకుమార్ వెనుక ఓ పోలీసు కూడా కనిపిస్తున్నాడు.

కర్ణాటక ప్రజలను ఉద్దేశించి తాను మాట్లాడాల్సి వుందని, అందుకు అనుమతి ఇవ్వాలని శివకుమార్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలో ఈ వీడియో విడుదల కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. కాగా, మంగళవారం నాడు శివకుమార్ ను మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు నాలుగు రోజుల ముందు నుంచి ఆయన్ను ప్రశ్నిస్తున్న అధికారులు, కేసులో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని చెబుతూ, శివకుమార్ ను అరెస్ట్ చేశారు.

Karnataka
DK Siva Kumar
ED
Arrest
Social Media
  • Error fetching data: Network response was not ok

More Telugu News