Saidharam Tej: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగీత దర్శకుడు... ఆసుపత్రిలో చేర్చిన హీరో సాయి ధరమ్ తేజ్!

  • షూటింగ్ తరువాత ఇంటికి బయలుదేరిన సాయి తేజ్
  • బైక్ యాక్సిడెంట్ ను చూసి ఆపిన వైనం
  • ప్రమాదానికి గురైన అచ్చును అపోలోలో చేర్చిన మెగా హీరో

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, అనుకోకుండా తన స్నేహితుడైన సంగీత దర్శకుడ్ని ఓ ప్రమాదం నుంచి కాపాడాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ శివార్లలోని నానక్ రామ్ గూడలో ఉన్న రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ను పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్, ఇంటికి కారులో బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఓ టూ వీలర్, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడాన్ని చూశాడు. బైక్ పై ఉన్న వ్యక్తి దాదాపు పదడుగుల దూరం ఎగిరి పడటంతో, కారును ఆపించి, అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యాడు. వాహనం ప్రమాదానికి గురైన వ్యక్తి, తన మిత్రుడు, సంగీత దర్శకుడు అచ్చు అని తెలుసుకుని, వెంటనే, తన కారులో అపోలో ఆసుపత్రికి తరలించాడు. ప్ర‌స్తుతం అచ్చుకు హాస్పిట‌ల్‌ లో చికిత్స జరుగుతుండగా, అతని ప్రాణాలకు ప్రమాదం లేదని తెలుస్తోంది.

Saidharam Tej
Road Accident
Achchu
Music Director
  • Loading...

More Telugu News