Uttar Pradesh: భర్త కిరాతకం.. అడిగిన వెంటనే భోజనం పెట్టలేదని భార్యను చంపేశాడు!

  • ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘటన
  • భోజనం పెట్టడం ఆలస్యం కావడంతో భార్యపై ఆగ్రహం 
  • చంపేసి మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన నిందితుడు

అడిగిన వెంటనే భోజనం పెట్టలేదన్న కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిందీ ఘటన. శ్రీకృష్ణ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌ను రాత్రి భోజనం పెట్టమని అడిగాడు. అయితే, ఆమె కొంత ఆలస్యం చేయడంతో శ్రీకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయాడు. అడిగిన వెంటనే భోజనం ఎందుకు పెట్టలేదంటూ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు.

ఆపై పదునైన ఆయుధంతో దాడిచేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సమీపంలోని పంటపొలంలో ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆ తర్వాతి రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. నిందితుడి తీరును అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బాగోతం బయటపడింది. పొలంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Uttar Pradesh
husband
wife
murder
  • Loading...

More Telugu News