River Tungabhadra: కర్ణాటకలో భారీ వర్షాలు.. కళకళలాడుతున్న తుంగభద్ర

  • ఆగుంబే,హరిహర, శివమొగ్గ ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • తుంగభద్రకు పెరుగుతున్న వరద
  • పూర్తిస్థాయికి చేరుకున్న జలాశయం నీటిమట్టం

కర్ణాటకలోని ఆగుంబే, హరిహర, శివమొగ్గ, మలెనాడు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద అంతకంతకూ పెరుగుతోంది. దీంతో తుంగభద్ర నది జలకళను సంతరించుకుంది. బుధవారం ఇన్‌ప్లో ఒక్కసారిగా పెరిగింది. జలాశయం నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఇక నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ఇది కూడా పూర్తిస్థాయికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో పది గేట్లు ఎత్తి 15370 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 22734 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్‌ఫ్లో 22314 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

River Tungabhadra
Dam
Karnataka
Rains
  • Loading...

More Telugu News