Rahul Gandhi: వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు.. కేంద్రంపై రాహుల్ ఫైర్

  • దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు
  • డీకే శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే
  • నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపునకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, డీకే అరెస్ట్ ముమ్మాటికీ కక్ష సాధింపులో భాగమేనని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Rahul Gandhi
DK Shivakumar
Karnataka
BJP
  • Loading...

More Telugu News