Pavan: 'బాలు' షూటింగులో పవన్ అలా చేశాడు: తనికెళ్ల భరణి

  • 'బాలు' షూటింగు జరుగుతున్న రోజులవి 
  • అప్పుడే 'నాలోన శివుడు గలడు' సీడీ చేశాను 
  • పవన్ నన్ను ఎంతగానో అభినందించాడన్న భరణి

రచయితగా .. నటుడిగా తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు వుంది. ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తూ శివుడి గురించి ఆయన అనేక పద్యాలను .. పాటలను రాశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు.

"పవన్ 'బాలు' సినిమా చేస్తున్న రోజులవి. ఆ సినిమాలో నేను ఒక వేషం వేశాను. షూటింగు షాట్ గ్యాపులో ఆయన కారవాన్ లో వున్నారు. ఆయన అసిస్టెంట్ తో కబురు చేసి నేను వెళ్లి ఆయనను కలిశాను. నేను రాసిన 'నాలోన శివుడు గలడు' అనే పాటల సీడీని పవన్ కి ఇచ్చేసి వచ్చేశాను. మరుసటి రోజు నేను సెట్ కి వెళ్లగానే, పవన్ నుంచి కబురు వచ్చింది. నేను ఆయన కారవాన్ లోకి వెళ్లగానే నన్ను గట్టిగా హత్తుకున్నారు. 'శివుడి గురించి మీరు రాసిన పాటలు విన్నాను .. ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఈ రోజు షూటింగుకి కూడా రావాలనిపించలేదు .. చాలా బాగా రాశారు" అంటూ అభినందించారు" అంటూ చెప్పుకొచ్చారు.

Pavan
Bharani
  • Loading...

More Telugu News