KCR: హరీశ్ రావు, ఈటలను కేసీఆర్ గెంటేయాలని చూస్తున్నారు: వివేక్

  • సొంత పార్టీ నేతల గొంతు కోస్తున్నారు
  • తెలంగాణ కోసం పోరాడిన వారిని గెంటేస్తున్నారు
  • కల్వకుంట్ల రాజ్యాన్ని విస్తరించాలని చూస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ నేతల గొంతు కోస్తున్నారని ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ కోసం మొదటి నుంచి హరీశ్ రావు, ఈటల రాజేందర్ పోరాడారని... అలాంటి వారిని కూడా కేసీఆర్ గెంటేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, కవితలతో రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. పెద్దపల్లి జిల్లాకు నీళ్లు ఇచ్చిన తర్వాతే... ఇతర ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.

KCR
KTR
Kavitha
Harish Rao
Etala
TRS
Vivek
BJP
  • Loading...

More Telugu News