India: మీ ఇష్టం.. పాక్ వెళ్తే మాత్రం భారత్ రావొద్దు: చైనా విదేశాంగ మంత్రికి తెగేసి చెప్పిన భారత్

  • పాక్‌లో పర్యటించి ఆపై భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి
  • పాక్ వెళ్లి ఆ వెంటనే భారత్ రావొద్దన్న భారత్
  • అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని చెప్పిన భారత ప్రభుత్వం

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ‌యీకి భారత ప్రభుత్వం షాకిచ్చింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన వంటి అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాకిస్థాన్‌లో పర్యటించాలని చైనా మంత్రి నిర్ణయించారు. ఆ వెంటనే భారత్‌లోనూ ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అయితే, వాంగ్ యీ షెడ్యూల్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొలుత పాకిస్థాన్‌లో కనుక పర్యటించాలనుకుంటే ఇక భారత్ రావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పింది.

రెండు దేశాల్లోనూ వెంట వెంటనే పర్యటించాలనుకుంటే తాము అంగీకరించబోమని, షెడ్యూలును మార్చుకోవాలని భారత్ స్పష్టం చేసింది. రెండు దేశాల్లోనూ ఒకేసారి పర్యటిస్తే అది రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నిబంధన ఒక్క చైనాకే కాకుండా ఇరు దేశాల్లో పర్యటించాలనుకున్న అన్ని దేశాలకు వర్తిస్తుందని భారత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News