Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీఎం కావాలి.. బీజేపీలో జనసేన కలవబోతోంది: బీజేపీ నేత అన్నం సతీశ్

  • డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుంది
  • బీజేపీలో చేరితే పవన్ బలం అమాంతం పెరుగుతుంది
  • ఆ తర్వాత పవన్ ను ఎవరూ ఆపలేరు

ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని చెప్పారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వస్తారని... ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారని తెలిపారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని చెప్పారు.

బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని... ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అన్నం సతీశ్... ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

Pawan Kalyan
Janasena
BJP
Annam Sathish
  • Loading...

More Telugu News