Crime News: ఇబ్రహీంపట్నంలో .. హాస్టల్‌ భవనం పైనుంచి పడిన బీటెక్‌ విద్యార్థిని.. తీవ్ర గాయాలు

  • మూడో అంతస్తు నుంచి పడడంతో తీవ్రగాయాలు
  • ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఘటన
  • మూడో సంవత్సరం చదువుతున్న సౌమ్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి విద్యార్థిని పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ప్రమాదవశాత్తు జారిపడిందా? లేక ఆత్మహత్యా యత్నం చేసిందా? అన్నది తెలియరాలేదు.

వివరాల్లోకి వెళితే...ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సౌమ్య అనే విద్యార్థిని మూడో సంవత్సరం బీటెక్‌ చదువుతోంది. కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఆమె మూడో అంతస్తు నుంచి ఈరోజు పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. కాగా, సౌమ్య కాలు జారిపడిందా? లేక ఆత్మహత్యా యత్నం చేసిందా? అన్న కోణంలో ఇబ్రహీం పట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News
Ranga Reddy District
ibhrahimatnam
girl slipped from third folour
  • Loading...

More Telugu News