samantha: సమంతకి ఆ సినిమా చేసే ఆలోచన లేదట!

  • సోనూ సూద్ కి పీవీ సింధు బయోపిక్ ఆలోచన 
  • సమంతను సంప్రదించే దిశగా ప్రయత్నాలు 
  • 'ఓ బేబీ' తరువాత ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పని సమంత

పీవీ సింధు బయోపిక్ ను నిర్మించాలనే ఉద్దేశంతో సోనూసూద్ రంగంలోకి దిగాడు. సమంతతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం ఇంతవరకూ ఆమెను ఎవరూ సంప్రదించలేదనేది తాజా సమాచారం.

పీవీ సింధు బయోపిక్ లో చేయడమనేది ఒక సాధారణమైన సినిమా చేసినంత తేలిక కాదు. బ్యాడ్మింటన్ లో కొంతకాలం పాటు శిక్షణ పొందవలసి ఉంటుంది. అందుకోసం ఎంతో శ్రమించాలి. ఈ ప్రాజెక్టు కోసం ఇతర అవకాశాలను కూడా వదులుకోవలసి వస్తుంది. అందువలన సమంతను సంప్రదించినా, ఈ సినిమాను ఒప్పుకోకపోవచ్చనే మాట ఆమె సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది. ఇక తను తల్లి కావాలనే ఉద్దేశంతోనే సమంత 'ఓ బేబీ' తరువాత ఏ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News