Andhra Pradesh: తెలుగుదేశం పార్టీకి సన్యాసిపాత్రుడు, 10 మంది మాజీ కౌన్సిలర్ల రాజీనామా!

  • అయ్యన్నపాత్రుడితో సన్యాసిపాత్రుడికి విభేదాలు
  • దీంతో టీడీపీని వీడుతారని కొంతకాలంగా ప్రచారం
  • ఏ పార్టీలో చేరతామో త్వరలో ప్రకటిస్తానన్నసన్యాసిపాత్రుడు

అనుకున్నట్లే జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత, అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు ఈరోజు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు భార్య అనిత, మరో 10 మంది మాజీ కౌన్సిలర్లు టీడీపీకి గుడ్ బై చెప్పారు. సోదరుడు అయ్యన్నపాత్రుడితో విభేదాల నేపథ్యంలో సన్యాసి పాత్రుడు టీడీపీని వీడబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.

కాగా, ఈ విషయమై సన్యాసిపాత్రుడు స్పందిస్తూ.. తామంతా టీడీపీకి రాజీనామా చేశామని ధ్రువీకరించారు. తాము ఏ పార్టీలో చేరబోతున్నామో త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, సన్యాసిపాత్రుడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Andhra Pradesh
Visakhapatnam District
Sanyasipatrudu
Resign
Telugudesam
party
Join
YSRCP
  • Loading...

More Telugu News