Andhra Pradesh: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు 34,294 మంది డుమ్మా

  • ఏపీలో జరుగుతున్న పరీక్షలు
  • కడప జిల్లాలో అత్యధిక హాజరు శాతం
  • చిత్తూరులో అత్యల్పమన్న అధికారులు

ఆంధ్రప్రదశ్ లో నిన్న జరిగిన గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో 34,294 మంది హాజరు కాలేదు. మొత్తం 1,55,173 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,20,879 మంది మాత్రమే హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

ఇక మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 72,584 మంది హాల్‌ టికెట్లను పొందగా, 65,811 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో కడప జిల్లాలో అత్యధిక హాజరు శాతం 80.91 శాతం ఉండగా, చిత్తూరు జిల్లాలో అత్యల్పంగా 73.50 శాతం మాత్రమే నమోదైంది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన రెండు పరీక్షలకూ కలిపి మొత్తం 1,86,690 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

Andhra Pradesh
Grama Secreteriate
Exams
  • Loading...

More Telugu News