Andhra Pradesh: తెలుగుదేశం పార్టీకి షాక్... వైసీపీలో చేరనున్న అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు!

  • అయ్యన్న ఫ్యామిలీలో విభేదాలు
  • భార్యతో కలిసి వైసీపీలోకి సన్యాసిపాత్రుడు
  • నేడు విశాఖలో నారా లోకేశ్ పర్యటన

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖ టీడీపీలో 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన భార్య అనితతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి.

అవి ఇటీవలి కాలంలో మరింత తీవ్రతరం కావడంతో సన్యాసిపాత్రుడు, ఆయన భార్య అనిత వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. నేడు నారా లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలోనే సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనుండటం గమనార్హం.  

Andhra Pradesh
Telugudesam
YSRCP
Ayyanna Patrudu
SANYASI PATRUDU
JOINING
  • Loading...

More Telugu News