Cheep Star: 'ఆర్ఎక్స్ 100' దర్శకుడి నోటి వెంట 'చీప్ స్టార్' మాట... ఎవరంటూ ఊహాగానాలు!

  • 'చీప్ స్టార్' అని కామెంట్ చేసిన అజయ్ భూపతి
  • తొలి చిత్రం తరువాత మరో సినిమాను పట్టాలెక్కించని దర్శకుడు
  • రవితేజను ఉద్దేశించి అన్నాడంటున్న నెటిజన్లు

'ఆర్ఎక్స్ 100' పేరిట నిర్మితమైన ఓ చిన్న సినిమాకు దర్శకత్వం వహించి, దాన్ని సూపర్ హిట్ చేసిన అజ‌య్ భూప‌తి, తన ట్విట్టర్ వేదికగా చేసిన ఒకే ఒక్క మాట ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చకు కారణమైంది. 'చీప్ స్టార్' అని ఆయన అన్న ఒక్క మాట ఎవరిని ఉద్దేశించి అయ్యుంటుందోనని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అసలేం జరిగిందంటే, సూపర్ హిట్ కొట్టినా అజ‌య్ భూప‌తి త‌న రెండో సినిమాను ఇంకా ప్రారంభించలేదు. ఆయన తదుపరి చిత్రం నేడో, రేపో అంటూ సాగుతూనే ఉంది. సోషల్ మీడియా మాత్రం ఆయన్ను వదల్లేదు. ఆ మధ్య సిద్ధార్థ్ తో అజయ్ భూపతి సినిమాను తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆపై సిద్ధార్థ్ కాదు, రవితేజ హీరో అంటూ కూడా న్యూస్ వచ్చింది.

ఇక వీరి కాంబినేషన్ లో చిత్రానికి 'మహాసముద్రం' అని పేరును పెట్టేసినట్టు కూడా నెటిజన్లు తేల్చేశారు. ఇక ఏమైందో ఏమో తెలియదుగానీ, అజయ్ భూపతి తన సోషల్ మీడియాలో 'చీప్ స్టార్' అని ఓ కామెంట్ పెట్టాడు. ఇక ఈ ట్వీట్ రవితేజను ఉద్దేశించి చేసిందేనని కొందరు, ఎవరో అజయ్ భూపతే చెప్పాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి అజ‌య్ భూప‌తి నోరు విప్పితే కానీ, దీనికి స‌మాధానం దొరకదు!

Cheep Star
Ajay Bhupati
Director
Tollywood
RX 100
  • Error fetching data: Network response was not ok

More Telugu News