YSRCP: మొక్కు తీర్చుకునేందుకు.. కాలినడకన నేడు తిరుమలకు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

  • నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర
  • కాకర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం తిరుమలకు
  • 15 రోజులపాటు కొనసాగనున్న యాత్ర

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కుకున్న ఆ పార్టీ నేత, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు నేడు మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు అర్ధవీడు మండలం కాకర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయన వెంట వైసీపీ శ్రేణులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున తిరుమల వెళ్లనున్నారు. నేడు ప్రారంభం కానున్న పాదయాత్ర 15 రోజులు కొనసాగనుంది. ఎమ్మెల్యే రాంబాబుతోపాటు వందమందికిపైగా కార్యకర్తలు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకోనున్నారు.  

YSRCP
ys jagan
anna rambabu
Tirumala
  • Loading...

More Telugu News