Vijay Antony: 'వర్షం నచ్చని వ్యక్తి'గా విజయ్ ఆంటోని

  • విజయ్ ఆంటోని హీరోగా కొత్త చిత్రం
  • దర్శకుడిగా విజయ్ మిల్టన్ 
  • కీలక పాత్రలో అల్లు శిరీష్  

'బిచ్చగాడు' సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తన సినిమాలు వైవిధ్యభరితంగా వుంటాయనే నమ్మకాన్ని ఆయన ప్రేక్షకులకు కలిగించాడు. అప్పటి నుంచి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందీ అంటే అభిమానులు ఆసక్తిని చూపిస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో ఒక సినిమా రూపొందుతోంది.

విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి 'మళై పిడిక్కాద మనిదన్'(వర్షం నచ్చని వ్యక్తి) టైటిల్ ను ఖరారు చేశారు. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అల్లు శిరీష్ కనిపించనుండటం విశేషం. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని శిరీష్ చెప్పడం, కథలో కొత్తదనాన్ని చెప్పకనే చెబుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Vijay Antony
Allu Sirish
  • Loading...

More Telugu News