Prabhas: ఈ దంపతులకు ప్రభాసే ఆరాధ్య దైవం!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-df11a6b985cafb4d62ac36b878ca64e1df5502a3.jpeg)
- అమెరికాలో ప్రభాస్ కు వీరాభిమానులుగా ఉన్న భార్యభర్తలు
- సాహోను విలక్షణ రీతిలో వీక్షించిన దంపతులు
- 3 రోజుల్లో 4 వేర్వేరు నగరాల్లో 6 సార్లు చూసిన కపుల్
టాలీవుడ్ లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాదిన మాత్రమే కాకుండా విదేశాల్లో సైతం ప్రభాస్ అంటే పడిచచ్చిపోయేవాళ్లకు కొదవలేదు. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న ఉడిపి రాఘవేంద్ర, శ్రీనిధి దంపతులకైతే ప్రభాస్ ఆరాధ్య దైవం అని చెప్పాలి. ప్రభాస్ సినిమాలే కాదు, ప్రభాస్ కు సంబంధించిన ప్రతి విషయం వారికి అపురూపం.
లేటెస్ట్ గా రిలీజైన సాహో చిత్రాన్ని ఈ జంట చాలా విచిత్రమైన రీతిలో వీక్షించింది. 3 రోజుల వ్యవధిలో 4 వేర్వేరు నగరాల్లో 6 సార్లు చూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే రాఘవేంద్ర సిస్కో సంస్థలో టెక్నాలజీ లీడర్ గా పనిచేస్తున్నాడు. వీళ్ల ఇంటినిండా ప్రభాస్ ఫొటోలే దర్శనమిస్తాయి. పూజామందిరంలోనూ ప్రభాస్ కు ప్రత్యేక స్థానం కల్పించారు. నైవేద్యాలు సరేసరి!
![](https://img.ap7am.com/froala-uploads/froala-f22f279d6ac58f963523819fcd0a70ea6cacc260.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-ca73c938ee840f8a739885630338692631008dfe.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-a410646562ac1dbda6b0426a4a1e298af8de1ade.jpeg)